సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 జులై 2023 (07:38 IST)

ఏపీలో వింత : ఆటో డ్రైవర్ ఇంటికి రూ.3.31 లక్షల విద్యుత్ బిల్లు

power bill
విశాఖపట్టణం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని గోకులపాడు అనే గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు విద్యుత్ బోర్డు అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఆటో డ్రైవర్ నివసించే పూరి గుడిసెకు కరెంట్ బిల్లు ఏకంగా 3,31,951 రూపాయలు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
గోకులపాడు దళిత కాలనీలో పూరి గుడిగెలో నివాసం ఉంటున్న రాజుబాబు అనే వ్యక్తి ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఉండేది పూరి గుడిసె. దీనికి ఏకంగా లక్షలాది రూపాయల్లో విద్యుత్ బిల్లు వచ్చింది. దీంతో రాజబాబు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈబీ అధికారులను సంప్రదించారు. 
 
సాంకేతిక సమస్య కారణంగా బిల్లు అంతమొత్తం వచ్చినట్టు గుర్తించారు. బిల్లును సరిచేసి వినియోగదారునికి బిల్లు అందజేసి, సాంకేతిక సమస్యను పరిష్కరించారు. దీనిపై కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి మాట్లాడుతూ, వినియోగదారుడికి ఈ నెల రూ.155 బిల్లు వచ్చిందని, అతనికి ఎస్సీ రాయితీ ఉండటంతో ఆ మొత్తం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.