శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (17:44 IST)

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రయాణికుడిపై అత్యాచారం

harassment
ముంబై మహానగరంలోని ఘట్కోపర్ శివారు ప్రాంతంలో ఓ ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రయాణ చార్జీ రూ.250 అడగ్గా రూ.100 మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ ప్రయాణికుడు ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఆ సమయంలో ప్రయాణికుడు తాగిన మత్తులో ఉన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శనివారం రాత్రి ఘట్కోపర్ శివారులో 31 యేళ్ల ప్రయాణికుడు ఓ ఆటో మాట్లాడుకున్నారు. తాగిన మత్తులో ఎక్కడికి వెళ్ళాలో స్పష్టత లేని ప్రయాణికుడు ఆటో డ్రైవర్‌ను పలు ప్రదేశాలకు తిప్పాడు. గంట తర్వాత ఆటో దిగిన ప్రయాణికుడితో రూ.250 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. 
 
ప్రయాణికుడు వంద రూపాయలు మాత్రమే చేతిలో పెట్టడంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది మరింతగా ముదరడంతో రెచ్చిపోయిన ఆటో డ్రైవర్.. ప్రయాణికుడిని సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆ తర్వాత ప్రయాణికుడిని ఏటీఎంకు తీసుకెళ్లి రూ.200 డ్రా చేయాలని బలవంతం చేశాడు. అక్కడ మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు తీసుకుని పరారయ్యాడు. మంగళవారం బాధిత ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.