1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (09:38 IST)

చపాతీ కోసం రిక్షాకార్మికుడి హత్య.. ఎక్కడ?

chapati
ఓ తాగుబోతు ఒక చపాతీ కోసం రిక్షా కార్మికుడిని హత్య చేశాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 26వ తేదీ రాత్రి పది గంటల సమయంలో మున్నా (40) అనే రిక్షా కార్మికుడు మరో వ్యక్తితో కలిసి ఢిల్లీలోని కారోల్‌ బాఘ్‌లో చపాతీ తింటున్నాడు. ఇంతలో అక్కడకు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. 
 
ఫిరోజ్ ఖాన్ అప్పటికే పీకల వరకు మద్యం సేవించడంతో మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో మున్నాను ఓ చపాతీ అడిగాడు. అతను ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మున్నాతో ఫిరోజ్ ఖాన్ వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డాడు.
 
దీంతో రిక్షా కార్మికుడు కూడా ఎదురు తిరగడంతో కోపోద్రిక్తుడైన ఫిరోజ్ ఖాన్.. తన వద్ద ఉన్న పదునైన కత్తితో మున్నాను పొడిచి చంపేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి మున్నాను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను చిక్కకుండా పారిపోయాడు. ఆ తర్వాత మరికొందరి సాయంతో మున్నాను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారైన ఫిరోజ్ ఖాన్‌‍ను అరెస్టు చేశారు.