రంజాన్ రోజున ముస్లిం సోదరులు ఇళ్ళలో ఉండే ప్రార్ధన చేయండి: చదలవాడ అరవింద బాబు
ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగ రోజున ముస్లిం సోదరులంతా తమ ఇళ్లలోనే ఉంటూ రంజాన్ ప్రార్థనలు ఆచరించాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹ చదలవాడ అరవింద బాబు సూచించారు. నరసరావుపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ నెల రోజుల పాటు పవిత్ర ప్రార్థనలతో, రోజు కఠిన ఉపవాసంతో నెల వంక దర్శనంతో "ఈద్-ఉల్-ఫితర్" జరుపు కోవడం చాలా సంతోషమన్నారు. కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి నమాజు ప్రార్థనలు చేసుకోవాలని, అలాగే వీలైనంత వరకు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని వినతి చేశారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీ ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, అభివృద్ధికి కృషి చేశామన్నారు.ముఖ్యంగా రంజాన్ తోఫా, దుల్హన్(పెళ్లి కానుక) పథకాలు పేద ముస్లిం మైనారిటీలకు చాలా ఉపయోగపడినవి. అయితే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు అందిస్తున్న అన్ని పథకాలు రద్దు చేయడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా గతంలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.