శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (14:50 IST)

రాష్ట్రపతికి అస్వస్థత : ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో కాస్త ఇబ్బందులు తలెత్తడంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 
 
'ఛాతీలో స్వల్ప ఇబ్బందుల కారణంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేడు ఆర్మీ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది' అని ఆర్మీ వైద్యులు పేర్కొన్నారు.  
 
కాగా, ఆసుపత్రిలో చేరకముందు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రథమ పౌరుడు అబ్దుల్ హమీద్‌కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కోవింద్ ఈ నెల మొదట్లోనే కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రెండో డోసు వేయించుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు లోనయ్యారు.