ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 మే 2020 (20:00 IST)

అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున సహాయం

రేపు (మంగళవారం) తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్ ‌లాక్‌డౌన్‌ కారణంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా వీరంతా దాదాపు 77 వేల మందికి పైగా ఉంటారని అంచనా. వీరందరికీ వన్‌టైం సహాయం కింద రూ. 5 వేల నగదును నేరుగా వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. 
 
దాదాపు 34 వేల మంది అర్చకులు, 30 వేల మంది పాస్టర్లు, 14 వేల మంది ఇమామ్, మౌజమ్‌లు ఈ సహాయం పొందనున్నారు. దాదాపు రూ. 38 కోట్ల నగదు సాయం ప్రభుత్వం అందించనుంది.