బయట బజ్జీల విక్రయం.. లోపల పడుపు వృత్తి... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో రోడ్ల వెంబడి ఉన్న ధాబాల్లో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పేరుకు బయట మాత్రం బజ్జీలు, బరోటాలు విక్రయిస్తుంటారు. లోపల మాత్రం పడుపు వృత్తిని గుట్టుచ
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో రోడ్ల వెంబడి ఉన్న ధాబాల్లో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పేరుకు బయట మాత్రం బజ్జీలు, బరోటాలు విక్రయిస్తుంటారు. లోపల మాత్రం పడుపు వృత్తిని గుట్టుచప్పుడు కాకుండాసాగుతోంది.
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కొండగట్టు పుణ్యక్షేత్రాలతో పాటు జగిత్యాలలో వ్యభిచారం జరుగుతున్నట్టుగా జిల్లా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మఫ్టీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురు నిర్వాహకులను అరెస్టు చేశారు. అలాగే, పడుపు వృత్తిలో నిమగ్నమైన మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ధర్మపురిలోని పుణ్యక్షేత్రం సమీపంలో, జాతీయ రహదారిపై ఉన్న వేశ్యా వాటికలపై దాడులు చేసి శ్యాంరావు అంజయ్య, శ్యాంరావు అంజలి, శ్యాంరావు అశ్విని అనే ముగ్గురు వేశ్యా గృహ నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వేశ్యా వాటికలో ఉన్న ఓ యువతిని(24) అదుపులోకి తీసుకుని విచారించగా తనను బలవంతంగా రొంపిలోకి దించారంటూ బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది.
జగిత్యాల జిల్లాలో చాలా కాలంగా పడుపు వృత్తి సాగుతోంది. హసన్‌పర్తి నుంచి యాదగిరి గుట్టకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు మహిళలను తరలిస్తుంటారు. ఆ తర్వాత నవీపేటకు, ఇక్కడి నుంచి జగిత్యాలకు పడుపు వృత్తి కోసం మహిళలను తరలిస్తూ ఉన్నారు.