ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 జులై 2024 (11:37 IST)

ప్రొటోకాల్ గొడవ.. అలిగి డివైడర్ దిమ్మెపై కూర్చొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ (Video)

ponnam prabhakar
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ్ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దాంతో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయట ఉన్న డివైడర్ దిమ్మెపై కూర్చొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా నగరవాసులు జరుపుకుంటున్నారు. ఇక నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 
 
ఈ కల్యాణంను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ప్రోటోకాల్ రగడ నెలకొంది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు.