శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (13:31 IST)

ప్రేమించాలంటూ సైకో వేధింపులు... భరించలేక యువతి సూసైడ్

ప్రేమించాలంటూ ఓ సైకో పెట్టిన వేధింపుల వల్ల ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు నగరంలోని కేఆర్‌ పురానికి చెందిన లీనా(17) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తోంది. 
 
ఈమె రామ్మూర్తినగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ పీయూసీ చదువుతోంది. ఇదే కాలేజీకి చెందిన మంజునాథ్ అనే యువకుడు తనను ప్రేమించాలని లీనా వెంటపడటం మొదలుపెట్టాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే సైకోలా ప్రవర్తించసాగాడు. 
 
దీంతో మానసికంగా కుంగిపోయిన లీనా మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో లీనా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. లీనాను మంజునాథ్ బెదిరిస్తున్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.