ఆంధ్రప్రదేశ్ లో పోక్సో కేసుల విషయంలో జిల్లా మరియు ప్రత్యేక న్యాయస్థానాలు, పోలీస్ యంత్రాంగం మరియు ఇతర సంబంధిత శాఖాల అధికారులు స్పందిస్తున్న తీరు, త్వరితగతిన తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి. హైమావతి ప్రసంశించారు.
ఆంధ్రప్రదేశ్ లో బాలలు మరియు బాలికల హక్కుల పరిరక్షణకు మన గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆడపిల్లలకు, మహిళలకు అదేవిధంగా ఆయా1 కుటుంబాలకు భరోసా మరియు ధైర్యంతో ఉంటున్నారని తెలియజేసారు.
మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో నగరం నడిబొడ్డున "దిశ " అత్యాచారం మరియు హత్య అత్యంత హేయమైన చర్య అని, జరిగిన సంఘటన పై ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి కేసులలో చట్టాలను అమలు పరచడం, దోషులను శిక్షించడంలో ఎలాంటి జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన పరిష్కరించడం చేయాలనీ ఆ దిశగా తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు చర్యలు చేపట్టడాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరుపున స్వాగతిస్తున్నామని అన్నారు.
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రిపోర్ట్ అవుతున్న బాలబాలికలు మరియు మహిళలపై అత్యాచారాలు, హత్యలు నివారణ అందరి బాధ్యత అన్నారు, రాబోయే భవిష్యత్ తరాలకు ఒక ఆరోగ్యకర సమాజం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. దీనితో పాటుగా అభివృద్ధి పథంలో భాగంగా వస్తున్నా కొత్త పంథాలు, అవిష్కరణల్లో సమాజానికి ఉపయోగపడేది లేనిది చూసి వాటిని ప్రోత్సహించాలని అన్నారు.
బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించి, వారికీ అండగా ఉండేలా ధైర్యాన్ని సంబంధిత వ్యవస్థల ద్వారా కల్పించాల్సిన భాద్యత అన్ని ప్రభుత్వ శాఖలు తీసుకోవాలని హైమావతి పేర్కొన్నారు. అప్పుడే ఎక్కడైనా ఎటువంటి సంఘటనలు జరిగిన, జరగడానికి ఆస్కారం ఉన్న వెంటనే నమ్మకంతో ప్రజలు ఫిర్యాదు చేస్తారని అభిప్రాయపడ్డారు. బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధమునకు పోక్సో కేసులకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా త్వరితగతిన కేసుల విచారణ జరిపి తీర్పులు రావడం హర్షించదగ్గ అంశమని, జిల్లా న్యాయయస్థానాలను ఈ సందర్బంగా అభినందించారు.
క్రిష్ణ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన బాలికపై మారుటి తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసుకి సంబంధించి దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష వేయడం ద్వారా దోషులకు తప్పకుండ శిక్ష పడుతుందని, తప్పించుకోలేరని రుజువు చేస్తూ నమ్మకాన్ని పెంచారన్నారు., అంతేకాని గతంలో లా దోషులను నామమాత్రంగా అరెస్ట్ చేసి, బెయిల్ పేరుతో లేదా మరే కారణాల వలనైనా సమాజంలో వదిలేస్తే మరో మారు పిల్లలు, మహిళలు పై అఘాయిత్యము చేయడానికి అవకాశం ఉండేదని, కానీ ప్రస్తుతం వస్తున్నా త్వరితగతిన తీర్పులవలన బాధితులకు నమ్మకం కలుగుతుందని, న్యాయస్థానాల తీర్పులను అందరు అభినందించదగ్గ అంశం అని అన్నారు.
తల్లితండ్రులు వారి కుటుంబాలలో పిల్లల్ని పెంచే క్రమంలో ఆడపిల్లల్ని, మహిళల్ని గౌరవించడం, మర్యాద ఇవ్వడం, ఆప్యాయత అనురాగాలు, బాధ్యతలను తెలుసుకొని మెలిగేలా పెంచాలన్నారు. అతి గారాబం, అవసరానికి మించి డబ్బులు ఇవ్వడం, వస్తువులు కొనివ్వడం కూడా పిల్లల్లో నిర్లక్ష్యధోరణి, దురలవాట్లకు లోనవడానికి కారణాలు అవవుతాయన్నారు. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని చాలా బాధ్యత తెలుసుకునేలా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ప్రపంచీకరణ రాష్ట్ర దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక దార్శనికత అనుగుణంగా మన ప్రభుత్వం బాలల హక్కులు పరిరక్షణకు కట్టుబడి ఉండడమే కాకుండా బాలలకు స్నేహపూర్వక ఆరోగ్యకర సమాజాన్ని అందించడానికి అమలు చేస్తున్న బాలల అభివృద్ధి కేంద్రీకృత పథకాలు, అనుసరిస్తున్న విధానాలు, ఆహ్లాదకర వాతావరణంలో విద్య, ఆత్మ రక్షణ సంబంధించి శిక్షణ కార్యక్రమాలను అందరు స్వాగతించాలని పిలుపునిచ్చారు.
మహిళలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి స్పందిచే విధంగా పనిచేస్తున్న ఉచిత సహాయ ఫోన్ నంబర్లు 112,181,100,1090,1091 తో పాటుగా చైల్డ్ లైన్ 1098, ‘0’ FIR ఫైలింగ్, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్, మహిళమిత్ర, శక్తిటీమ్స్ మొదలైన ఎన్నో బాలల, మహిళల రక్షణకు, భద్రతకు అండగా కల్పిస్తున్నారన్నారు.
వీటన్నింటిపై ప్రతిఒక్కరు అవగాహనా పెంచుకుని, ఆపద సమయములో వినియోగించుకోవాలని కోరారు. కుటుంబం కేంద్రంగా బాలల సంక్షేమం, పాఠశాల, కళాశాల విద్య అభివృద్ధి కై రూపొందించిన "అమ్మఒడి " పథకం అంతర్జాతీయంగా ఆదర్శమని కొనియాడారు. ప్రతి తల్లితండ్రులు ఈ పథకం క్రింద వారి పిల్లలకు విద్య ద్వారా బంగారు భవిష్యత్ ను అందించడానికి వీలవుతుందని కొనియాడారు.
అలాగే కమిషన్ ద్వారా అవహగానా ప్రచారానికి వివిధ అంశాలపై IEC మెటీరియల్ తో విద్యార్ధులుకు, తల్లిదండ్రులుకు, సమాజంలో చైతన్యం మరియు బాలల హక్కుల పట్ల అవగాహనా, పరిరక్షహించుకునే విధానాలు, అందుబాటులో ఉన్న సేవల గూర్చి సంబంధిత శాఖల సమన్వయంతో, సాంకేతిక బృందాల సహకారాన్ని, థెమటిక్ వర్కింగ్ గ్రూప్స్, నెట్ వర్క్స్, స్వచ్చంద సంస్థలు మొదలైన సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగిందని వీటిని మరింత విస్తరించి కొనసాగిస్తామని అన్నారు.
అలాగే కమిషన్ ద్వారా బాలల చట్టాలైనా కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్, పోక్సో , బాలల న్యాయ చట్టం, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టంల ను పర్యవేక్షించడం తో పాటుగా బాల్య వివాహ నిషేధ చట్టం, బాల మరియు కిశోర కార్మిక నిర్ములన చట్టం మొదలైన ఇతర బాలలకు సంబంధించిన చట్టాల అమలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా బాలబాలికలకు సంబంధించి సమస్యలు తెలియ చేయాలన్న ఇమెయిల్ :
[email protected] ద్వారా లేదా చినకాకాని , మంగళగిరి లో ఉన్న కమిషన్ కార్యాలయం లో నైనా తెలియచేయవచ్చని అన్నారు