బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (16:33 IST)

జగన్ పాలనపై రజనీ.. ప్రజా సేవ కోసం వచ్చాం..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై  చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ఎడ్యుకేటెడ్ ప‌ద్ధ‌తి ప్రకారం ప‌రిపాల‌న‌ను సాగిస్తుందని చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. సీఎం జగన్ ప్రతి పేద వాడి కష్టాన్ని చూసారని, తప్పకుండా అందరికి న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాదు జగన్ మాపై ఉంచిన నమ్మకానికి వంద రెట్లు ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు తప్పకుండా అందరికి న్యాయం చేస్తామని వెల్లడించారు. చిల‌క‌లూరిపేట‌లోని కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జరిగిన‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, ఎలాంటి అవకతవకలకు, ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం తావు ఇవ్వబోదని తేల్చి చెప్పేశారు. 
 
జగన్ మంత్రివర్గంలో స్థానం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదని, ప్రజా సేవ కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. అయితే ప్రజలు ఆశీర్వదించినట్టే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటే ఎంతటి పదవులైనా దక్కడం సులభమేనన్నారు.