గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (19:19 IST)

8న దేవాలయాల పునర్నిర్మాణం శంకుస్థాపన

చంద్రబాబు తన హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. కూల్చివేత‌కు గురైన ఆ దేవాల‌యాల పున‌ర్మిర్మాణానికి ఈనెల 8న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. 

విజయవాడలో కూల్చివేసిన దేవాలయాలు దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు–కేతు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడు గుడిని నిర్మిస్తామని చెప్పారు. ఈనెల 8న ఉదయం 11.01 గంటలకు ఆలయాల నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

అదే విధంగా రూ.70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. 13 జిల్లాల్లో 40 దేవాలయాల పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.