1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (13:19 IST)

అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులతో దడ పుట్టించిన వైకాపా నేతలు

recording dance
ఏపీలోని అధికార నేతలు అధికర బలంతో విర్రవీరిగిపోతున్నారు. ఇప్పటికే ప్రజలను అన్ని విధాలుగా వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైకాపా నేతలు తమ పుట్టిన రోజుల పేరుతో అర్థరాత్రి పూట అసభ్యకర, అశ్లీల నృత్యాలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో వైకాపా నాయకులు యువతులతో కలిసి రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. 
 
అలాగే, జిల్లా కేంద్రం బాపట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో వైకాపా నేతలు బరితెగించారు. పట్టణంలో రద్దీగా ఉండే సూర్యలంక రోడ్డులో ఏకంగా వేదిక ఏర్పాటు చేయించి గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు వేయించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గురువారం తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బుధవారం అర్థరాత్రి దర్శిలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేశారు. ఇందుకు వైకాపా నేతలు పట్టణ నడిబొడ్డున గడియారస్తంభం కూడలిలో తూర్పు చౌటపాలెం రోడ్డు మధ్యలో వేదిక ఏర్పాటుచేయించారు.
recording dance
 
అర్థరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే కేకు కోశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆయన సోదరుడు శ్రీధర్ సమక్షంలోనే 'ఊ.. అంటావా మావ.. ఊహూ అంటావా..' అంటూ యువతులు డ్యాన్సులు చేశారు. ఎమ్మెల్యే వెళ్లాక వైకాపా నాయకులు యువతులను ఒడిలో కూర్చోబెట్టుకొని మరీ నృత్యాలు వేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా వేదిక ఏర్పాటు చేయడమేకాక.. రికార్డింగ్ డ్యాన్సులు వేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అలాగే, బాపట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో వైకాపా నేతలు బరితెగించారు. పట్టణంలో రద్దీగా ఉండే సూర్యలంక రోడ్డులో ఏకంగా వేదిక ఏర్పాటు చేయించి గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు వేయించారు. ఎమ్మెల్యే రఘుపతిని వేదిక వద్దకు తీసుకొచ్చి గజమాలతో సత్కరించి, కేక్ కోయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. డీజే మోతలకు స్థానికులకు అసౌకర్యానికి గురయ్యారు. ఆ మార్గంలో వెళ్లే వారంతా నాయకుల తీరు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.