గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2020 (19:31 IST)

తిరుపతిలో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్‌కు వినతి

తిరుపతి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని భువనేశ్వర్‌కు చెందిన హైటెక్ గ్రూప్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విన్నవించారు.
 
మంగళవారం రాజ్ భవన్ దర్బార్ హాలులో గౌరవ గవర్నర్‌తో సమావేశం అయిన హైటెక్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ తిరుపతి ప్రాణీగ్రాహీ తిరుపతి పట్ణణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మెడికల్ కళాశాల గురించి వివరించారు.
 
అత్యధునిక సౌకర్యాలతో ఆదునిక వసతులతో ఏర్పాటు చేసిన ఆసుప్రతి, మెడికల్ కళాశాలలను ప్రారంభించేందుకు ముఖ్య అతిధిగా విచ్చేయాలని ఈ సందర్భంగా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో రాజన్ కుమార్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.