15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala
ఎం| Last Updated: మంగళవారం, 12 జనవరి 2021 (10:25 IST)
పవిత్రమైన ధనుర్మాసం జ‌న‌వ‌రి 14వ తేదీ గురువారం ముగియనుండడంతో శుక్ర‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో పునఃప్రారంభం కానుంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ శుక్ర‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.

అదేవిధంగా జనవరి 15వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయి.దీనిపై మరింత చదవండి :