శ్రీశైలంలో మరో 5 రోజులు దర్శనాలు నిలుపుదల
శ్రీశైలమహాక్షేత్రంలో కరోనా రోజు రోజుకి విజృంభించడంతో మరో ఐదు రోజుల పాటు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.
తహశీల్దార్, వైద్యాధికారి సోమశేఖరయ్య సూచనల మేరకు దేవాదాయ కమిషనర్, జిల్లా కలెక్టర్ అనుమతితో మరో 5 రోజుల పాటు దర్శనాలు నిలుపుదల చేశారు.
అనంతరం అప్పటి పరిస్థితులు బట్టి తగిన చర్యలు తీసుకోనున్నారు. స్వామి అమ్మవార్లకు జరిగే నిత్యకైంకర్యాలు యధావిధిగా జరుగుతాయి.
భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా రుసుమును చెల్లించి వారి గోత్రనామాలతో పరోక్ష సేవలను జరిపించుకోవచ్చని ఈవో తెలిపారు. ఈ నెల 31 వ తేదీన శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పరోక్ష సేవగా నిర్వహిస్తున్నారు.