2 నుంచి మంత్రాలయం దర్శనాలు

raghavendra swami
ఎం| Last Updated: మంగళవారం, 30 జూన్ 2020 (08:12 IST)
జులై 2వ తేదీ నుంచి మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించినట్లు మఠం మేనేజర్‌ వెంకటేశ్‌ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేవాదాయశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. పదేళ్లలోపు, 65 ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, కంటైన్‌మెంటు జోన్ల నుంచి వచ్చేవారు మినహా అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆలయానికి వచ్చే భక్తులకు ముందుగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత కొవిడ్‌ లక్షణాలు లేనివారినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అన్నవితరణ, ప్రసాదాల పంపిణీలు ప్రస్తుతానికి లేవన్నారు.

ఆర్జిత సేవలు పరోక్షంగా నిర్వహిస్తామని, గర్భగుడి దర్శనాలు లేవన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దర్శనాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.దీనిపై మరింత చదవండి :