సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (19:05 IST)

దుర్గా దేవి ఆలయంలో సాఫీగా దర్శనాలు

దేవస్థానము నందు ఈరోజు  అమ్మవారి దర్శనమునకు భక్తులను ధర్మ దర్శనము మరియు ముఖమండప దర్శనములు  టైం స్లాట్ పద్దతి ద్వారా అమ్మవారి దర్శనము చేసుకున్నారు.

పరిమిత సంఖ్యలో చండీ హోమం, శాంతికల్యాణము, శ్రీచాక్రనవావర్నార్చన, రుద్రహోమము  మరియు లక్షకుంకుమార్చన సేవలు జరిపించుకోనుటకు భక్తులకు అవకాశము కల్పించబడినది. 

ప్రత్యక్షముగా పూజల యందు పాల్గొను అవకాశము లేనటువంటి భక్తుల సౌకర్యార్థము దేవస్థానము నందు జరుగు శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము, రాహు కేతు పూజలు పరోక్షముగా భక్తుల గోత్ర నామములతో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినది.

ఈ పరోక్ష  సేవలు పరోక్షముగా  జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు online నందు www.kanakadurgamma.org  – website  ద్వారా పొందవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపియున్నారు. పరోక్ష సేవలు బుక్ చేసుకున్న భక్తులందరికీ అమ్మవారి ప్రసాదములు పోస్టు ద్వారా పంపబడును అని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.

దర్శనము మరియు సేవల, ప్రసాదము టికెట్లు కొరకు  భక్తులు  online నందు www.kanakadurgamma.org వెబ్ సైటు, kanakadurgamma అను ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, మీ సేవ సెంటర్లు, దేవస్థానము కౌంటర్లు నందు పొందవచ్చని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు.

దేవస్థానము ప్రాంగణముల నందు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, సానిటైజర్లు ఏర్పాటు, ప్రతినిత్యము క్యూ లైన్లు పరిశుబ్రత, థర్మల్ సేన్సార్స్ ఏర్పాటు మరియు ఇతర పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Øమాస్కు ధరించిన భక్తులను మాత్రమే శ్రీ అమ్మవారి దర్శనమునకు అనుమతించబడుచున్నదని తెలిపారు.
Øఆలయ పరిసర ప్రాంతములు పరిశుభ్రముగా ఉంచుతూ ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లేరైడ్ తో  శుభ్రపర్చుటకు తగిన చర్యలు తీసుకొనబడినదని తెలిపారు.
Ø భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపర్చుకొని మహామండపము క్యూ లైను మార్గము ద్వారా దర్శనమునకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేయడమైనది.
Ø భక్తుల సౌకర్యము కొరకు ఉదయం 7 గం. ల నుండి మధ్యాహ్నం 3 గం.ల వరకు పులిహోర/దద్దోజనము ప్రసాదము ను దర్శనము అనంతరము  ప్యాకెట్ల రూపములో  సిబ్బంది మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు ధరించి  భక్తులకు పంచిపెట్టబడినది.