1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (12:07 IST)

రిషితేశ్వరి ఆత్మహత్య: ర్యాంగింగ్ ఘటనపై వీసీ సీరియస్.. విద్యార్థిపై కొరడా!

ర్యాంగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటనపై ఇన్ చార్జీ వీసీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి వేగంగా స్పందించారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్ధిపై కొరడా ఝుళిపించారు. రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. 
 
వివరాల్లోకెళితే... రిషితేశ్వరి ఘటనతో అప్పటిదాకా ఉన్న వీసీని బదిలీ చేసిన ప్రభుత్వం ఐఏఎస్ ఉదయలక్ష్మిని ఇన్ చార్జీ వీసీగా నియమించిన సంగతి తెలిసిందే.

అయితే, వర్సిటీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని తనపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని వర్సిటీలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై వేగంగా స్పందించిన ఉదయలక్ష్మి విచారణలో ర్యాంగింగ్ జరిగిన మాట వాస్తవమని తేలడంతో ర్యాంగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థిని గుర్తించి రెండు వారాల పాటు సస్పెన్షన్ విధించారు.