బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శనివారం, 25 మే 2019 (13:31 IST)

అన్నా.. ఆ అధికారి వద్దు.. బదిలీ చేయండి.. జగన్‌తో ఎమ్మెల్యే రోజా

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత జగన్ కూడా ఎన్నోసార్లు ఈ విధంగా ఇబ్బందులు పడ్డారు. వైజాగ్ విమానాశ్రయంలో జగన్‌ను పోలీసులు అడ్డుకుంటే కాబోయే సిఎం నేనే.. మీ పని పడతానంటూ స్వయంగా జగనే హెచ్చరించారు కూడా. జగన్‌తో పాటు చాలామంది నేతలు చెప్పుకొచ్చారు.
 
అనుకున్న విధంగా వైకాపా విజయం సాధించింది. ఇక తమను ఎవరు ఇబ్బందులు గురిచేశారో వారి పనిపట్టే పనిలో నిమగ్నమయ్యారు వైసిపి నేతలు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జెఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసరాజుపై ఎమ్మెల్యే ఆర్కే.రోజా గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం ఆమెను జేఈవో తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే. ప్రోటోకాల్ ఉన్నా ఆమెకు పూర్తిస్థాయిలో టిక్కెట్లను కేటాయించలేదు. పైగా మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండంటూ చెప్పుకొచ్చాడు.
 
దీంతో రోజా చాలాసార్లు మీడియాతో మాట్లాడింది. ఏడు సంవత్సరాలుగా తిరుమలలో తిష్టవేశాడు జెఈఓ. మా పార్టీ అధికారంలోకి వచ్చిందే ఆయన్ను మార్చేస్తామని చెప్పారు. మొన్న కౌంటింగ్‌లో భారీ మెజారిటీ తర్వాత జగన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రోజా. 
 
శుక్రవారం తితిదే తరపున శ్రీవారి ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించేందుకు వెళ్ళారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీనివాసరాజు. విషయం కాస్త రోజాకు తెలిసిందే. రాత్రి 10 గంటల సమయంలో జగన్‌కు ఫోన్ చేసిన రోజా జెఈఓ శ్రీనివాసరాజును మార్చేద్దామన్నా. 
 
అతను టిడిపి నేతలకు సపోర్ట్ చేస్తాడు. అతను మనకొద్దు అంటూ చెప్పింది. దీంతో జగన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తమకు అనుకూలంగా ఉన్న ఐఎఎస్, ఐపిఎస్‌లను కీలక శాఖల్లో వేసి ఇబ్బందులకు గురిచేసిన వారిని పనికిమాలిన శాఖల్లో వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.