మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (13:16 IST)

ప్ర‌మాదం జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా... రోడ్డుపై ఇదే సీన్ ఇంకా!

ఇటీవల చట్టానికి సోమరితనం బద్ధకం ఎక్కువ అయినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా మోరంపూడి జంక్షన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఒక వ్యక్తి ఒక లారీ క్రింద వెళ్లిపోయి ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు వచ్చారు... జరగాల్సిన తంతునంతా నిర్వహించారు.


అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా, సంఘటన ప్రాంతం నుంచి లారీని గాని, లారీ  కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించకుండా ఘటనా ప్రాంతంలోనే లే ఉంచి వేశారు. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే మోరంపూడి జంక్షన్ లో ఇది వాహనదారుల‌కు ఇబ్బందిగా మారింది. ఘటనకు సంకేతమైన వాహనాలను ఘటనా ప్రాంతం నుంచి తొలగించకుండా అక్కడే వదిలివేయడం పై అనేకమంది వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, ఘటనా ప్రాంతం నుంచి లారీను, లారీ కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.