ఏపీలో ఫౌండేషన్ స్కూళ్లకు రూ.1,863 కోట్లు వరల్డ్ బ్యాంక్ సహాయం
ఆంధ్రప్రదేశ్‌లో ఫౌండేషన్ స్కూళ్ల అభివృద్ధికి 250 మిలియన్ డాలర్లు అంటే రూ. 1,863 కోట్ల రూపాయలను వరల్డ్ బ్యాంక్ అందిస్తోంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు టీచర్లలో స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం ఈ నిధులను వెచ్చించనుంది.
మొత్తం 50 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధిపొందనున్నారు. అంగన్‌వాడీల్లో చదివే 3 నుంచి 5 ఏళ్ల మధ్య వయసున్న పది లక్షల మంది విద్యార్థులు ఇందులో ఉన్నారు. వీరుకాక, 45 వేల పాఠశాలల్లో చదివే 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 40 లక్షల విద్యార్థులు, 1.90 లక్షల మంది టీచర్లు, 50 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు లబ్ధిపొందనున్నారు.
కోవిడ్‌తో బారిన పడిన విద్యార్థుల రక్షణ, చదువుల్లో వెనకబడిన విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, విద్యార్థునులపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు. పాఠాలు బోధించే టీచర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని నేటి విద్యా అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఏపీలో విద్యా వెలుగులు నింపడానికి ఈ వరల్డ్ బ్యాంక్ సహాయం ఎంతగానో ఉపకరిస్తుంది.