శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:03 IST)

మొదటిదశ ఇళ్ల కేటాయింపులోనే రూ.4వేల కోట్లు ఎగనామం: పట్టాభిరామ్

ఇళ్లపట్టాల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడానికి ఒకరోజు ముందు టీడీపీకేంద్రకార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంద్వారా జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి పనికిరాని స్థలాలను ఇళ్లపట్టాలుగా ఇస్తున్నాడో ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చెప్పడం జరిగిందని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.   ఆ వివరాలు ఆయన మాటల్లోనే...!  

దిక్కుమాలిన ఇళ్లప్లాట్లను ప్రజలకుఇవ్వడంకోసం భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయడం, ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం అందరం చూశాం.  పేదలకుఇళ్లపట్టాలిచ్చే నెపంతో రూ.6,500కోట్ల భారీ అవినీతికి జగన్ ప్రభుత్వం పాల్పడిన విషయాన్నికూడా తాము బయటపెట్టాము. వైసీపీప్రభుత్వం ఇళ్లప్లాట్లు ఇచ్చేప్రదేశంలో మీడియావారి వాహనమే మట్టిలో  కూరుకుపోయింది.

అటువంటి ప్రదేశంలో పేదలు ఇళ్లెలా కడతారో చూడాలి.  చంద్రబాబునాయుడి ప్రభుత్వం వివిధపథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా  20లక్షల90వేల గృహాల నిర్మాణానికి శ్రీకారంచుట్టి 2019 మార్చినాటికి  దాదాపు 8లక్షల  గృహాలను పంపిణీకి సిద్ధంచేసింది.  
   
టీడీపీప్రభుత్వహయాంలో పట్టణప్రాంతాల్లోని పేదలకోసం 300, 365, 430 చదరపు అడుగుల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆ విధంగా నిర్మించిన వాటినిపేదలకుఇవ్వకుండా తొక్కిపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలప్రచారంలో రూపాయిఖర్చుకూడా లేకుండానే పేదలకు టిడ్కో గృహాలను అందిస్తానని చెప్పాడు. బ్యాంకురుణాలు కూడా తమప్రభుత్వమే భరిస్తుందని ఆనాడు జగన్ చెప్పడం జరిగింది. 

ఎన్నికలకు ముందు, పేదలఓట్లు కొట్టేయడంకోసం అలా చెప్పిన వ్యక్తి నేడు, అన్నిహామీల్లానే ఇళ్లకేటాయింపుహామీలో కూడా మాటతప్పి, మడమతిప్పాడు.  నేడు మొదటిదఫా 2లక్షల62వేల టిడ్కోఇళ్ల పంపిణీలో 365, 430 చదరపు అడుగుల్లో నిర్మించిన గృహాలకు సంబంధించి లబ్దిదారులకు చెందిన 50శాతంవాటాను, అందుకు అవుతున్న రూ.482కోట్ల ఖర్చుని కూడా తనప్రభుత్వమే భరిస్తున్నట్లు ప్రకటనల్లో చెప్పుకుంటున్నాడు. గృహనిర్మాణానికి సంబంధించి అబద్ధాలతో మోసంచేయాలని చూస్తున్నాడు. 
 
ఏపీ టిడ్కోఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 300చదరపు అడుగుల్లో నిర్మితమైన ఎన్టీఆర్ గృహాలు లక్షా43వేలవరకు ఉన్నాయి. 365 చదరపు అడుగులవి 74వేల312ఉంటే, 430 చదరపు అడుగులవి 44వేల304 వరకుఉన్నాయి. ఆయా ఇళ్లన్నింటినీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం మొదటిదశలో లబ్ధిదా రులకు కేటాయించడానికి సిద్ధమైంది.

ఆయా ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారుడివాటా కలిపిబ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ము కలిపితే, 365చదరపు అడుగులఇంటికి రూ.3లక్షల50 వేలు ఉంది. ఆమొత్తాన్ని లబ్దిదారుడే చెల్లించాలి. అందులో బ్యాంకురుణం రూ.3లక్షలైతే, లబ్దిదారుడి వాటా రూ.50వేలు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుచెబుతున్నది ఏమిటంటే ఆ మొత్తం సొమ్ములో  కేవలంరూ.25వేలు మాత్రమే చెల్లిస్తాననడం. తద్వారా ఆయన ఎన్నికల్లో చెప్పినట్లుగా మొత్తంసొమ్ము చెల్లించకుండా కేవలం రూ.25వేలతో సరిపెట్టి, లబ్దిదారుడికి రూ.3లక్షల25వేల వరకు ఎగ్గొడుతున్నాడు. 

ఒక్కో లబ్దిదారుడికి రూ.3లక్షల25వేల చొప్పున మొత్తమ్మీద 365చదరపు అడుగులకు సంబంధించే,  రూ.2,405కోట్లవరకు జగన్ పేదలకు ఎగనామం పెడుతున్నాడు.  అదలా ఉంటే, 430చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి చూస్తే, 44వేలమంది లబ్ధిదారులుంటే, ఒక్కో లబ్ధిదారు రూ.4లక్షలవరకు కట్టాల్సిఉందని, దానిలో లబ్దిదారు వాటా రూ.లక్ష అయితే, బ్యాంకు రుణం రూ3లక్షలుగా ఉంది. 

ఆ మొత్తం సొమ్ములో జగన్మోహన్ రెడ్డి కేవలం రూ.50వేలు మాత్రమే చెల్లిస్తాననిచెప్పి, మిగిలిన రూ.3లక్షల50వేలను పేదలకు ఎగ్గొట్టడానికి సిద్ధమయ్యాడు. 44వేలమందికిగాను, ఒక్కొక్కరికి రూ.3లక్షల50వేలచొప్పున ఎగ్గొడితే, రూ.1540కోట్లవరకు జగన్ ప్రభుత్వం  పేదలకు ఇవ్వకుం డా కాజేస్తోంది. అంటే మొదటిధపా ఇళ్లపంపిణీలోనే 365, 430చదరపు అడుగులకుసంబంధించే దాదాపుగా రూ.3,924కోట్లు (రూ.4వేలకోట్లు) పేదలకు ఎగనామం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. 

ఆ విధంగా పేదలకు ఇస్తానన్నది ఇవ్వకుండా, ఇళ్లపట్టాల ప్రచారం కార్యక్రమంలో రూ480కోట్లు మేలుచేస్తున్నట్లు సిగ్గులేకుండా ముఖ్య మంత్రి ఎలా చెప్పుకుంటున్నాడు. రూ4వేలకోట్లు పేదలకు ఇస్తాననిచెప్పి, ఇవ్వకుండా ఎగనామంపెట్టిన ముఖ్యమంత్రి, వారిని మోసగించి, పేదలకు రూ.482కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు.

ఇళ్లపట్టాల ముసుగులో రూ.6,500కోట్లు కాజేసిన జగన్ ప్రభుత్వం, టీడీపీప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా బ్యాంకురుణాలు తనప్రభుత్వమే చెల్లిస్తుందని మోసపు మాటలుచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రూ.4వేలకోట్లవరకు పేదలకు ఎగ్గొట్టాడు. మొత్తంగా చూస్తే, ఇళ్లస్థలాలు, ఇళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం రూ.10,500కోట్లవరకు కాజేసింది. 

పట్టణప్రాంతాల్లోని అర్హులైనపేదలకు ఇళ్లనిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తమప్రభుత్వమే భరించి ఉచితంగా గృహాలను అందిస్తుందని, పట్టణప్రాంతాల్లోని పేదలు ఇళ్లకోసం తీసుకున్న బ్యాంకురుణాలను మాఫీ చేసి, పూర్తిఉచితంగా పేదలకు ఇళ్లను అందిస్తామని టీడీపీ 2019ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే నిజంగా పేదలకు రూ.4వేలకోట్ల వరకు మేలుజరిగేది. 

అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారమే టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సంఖ్యప్రకారం చూస్తే, నేడుఆయన పేదలకు రూ.4వేలకోట్ల వరకు ఎగ్గొట్టాడని స్పష్టమవుతోంది. చేయాల్సిందం తాచేసి, బహిరంగసభలు పెట్టి, అంతా మేలుచేస్తున్నట్లు చెప్పుకుం టున్నాడు.  చెప్పినట్టుగా రూ.4వేలకోట్లను పేదలకు జగన్ అందించాల్సిందే. అందులో మరో సందేహమేలేదు. 

30లక్షల76వేల ఇళ్లప్లాట్లలో కేవలం 90శాతం ఇళ్లస్థలాలు మాత్రమే తాను ఇస్తున్నట్లు నిన్నటిసభలో ముఖ్యమంత్రి చెప్పా డు. 28లక్షల30వేల ప్లాట్లను మాత్రమే తాను ఇస్తున్నానని, మిగిలినవాటిపై కోర్టుకేసులున్నాయని అందుకే ఇవ్వలేకపోతున్నా నని చెప్పడం ద్వారా జగన్ తొలిసారి నిజం చెప్పాడు. 

నిన్నటివరకు చేతిలోఉన్న దొంగపత్రికను అడ్డంపెట్టుకొని ఇళ్లపట్టాల పంపిణీపై టీడీపీ కోర్టులకు వెళ్లిందని తప్పుడుప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు 90శాతం పట్టాలుఇస్తున్నట్లు ఎలా చెప్పాడు? కేవలం పదిశాతం ప్లాట్లకుసంబంధించి మాత్రమే కోర్టుల్లో కేసులున్నాయని ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడు.

మరి అలాంటప్పుడు సంక్రాంతికి, ఉగాదికి, మానాన్న జయంతికి ఇళ్లప్లాట్లు ఇస్తానని ముఖ్యమంత్రి ఎందుకప్రజలను మోసగించాలని చూశాడు. పేదలకు స్థలాలివ్వకుండా ఇన్నాళ్లు ఎందుకు తొక్కిపెట్టారు? అందుకే ముఖ్యమంత్రిని ఫేక్ సీఎం అనేది.

తాడేపల్లి ప్యాలెస్ కు అందాల్సినముడుపులు అందలేదని ఇప్పటివరకు జగన్మోహన్  రెడ్డి ఇళ్లపట్టాలివ్వలేదా? తాడేపల్లి ప్యాలెస్ లోజగన్ అవినీతి లెక్కలుచూసే చిత్రగుప్తుడు సజ్జలకు, జిల్లాలవారీగా ఇళ్లపట్టాల సొమ్ముతాలూకా లెక్కలు అందలేదని ఇన్నాళ్లూ పట్టాల పంపిణీని నిలిపివేశారు. 

పేదలకు చెందిన అసైన్డ్ భూములను లాక్కొని, పేదలకు ఇళ్లపట్టాల రూపంలో అందించాలని జగన్ ప్రభుత్వం చూడబట్టే, భూములు కోల్పోయిన అనేకమంది చనిపోయారు. భూసేకరణ భయంతో, అధికారుల వేధింపులతో అనేకమంది అసైన్డ్ రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

(జిల్లాలవారీగా మరణించిన రైతుల వివరాలను పట్టాభి ఈసందర్భంగా విలేకరులకు చదివి వినిపించా రు) తమ భూములుకోల్పోయిన వారు ప్రభుత్వ తీరుకి నిరసనగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ విషయం తెలిసికూడా ముఖ్యమంత్రి కేవలం తనఅవినీతి వాటాలకోసమే ఇన్నాళ్లుగా ఇళ్లపట్టాల పంపిణీని తొక్కిపెట్టి, కావాలనే టీడీపీపై బురదజల్లారు. 

ఇళ్లపట్టాల పంపిణీలో అవినీతిసొమ్ము లెక్కలు తేలక, తనకు అందాల్సిన సొమ్ము అందకనే ఏడాదినుంచి ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వలేదని నిన్నఆయన మాటలతోనే తేలిపోయింది. మరోపక్క టిడ్కోగృహాలకు సంబంధించి రూ.482కోట్లు అదనంగా ఇస్తున్నాననిచెప్పుకుంటూ, 365, 430 చదరపు అడుగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రూ.4వేలకోట్ల వరకు పేదలకు ఎగ్గొట్టాడని తేలిపోయింది. 

నేడు నేనుచెప్పిన లెక్కలే అందుకు ఉదాహరణ.  365 చదరపు అడుగులకేటగిరిలో 74వేల312మంది  లబ్దిదారులకు, రూ.2045కోట్లు, 430 చదరపు అడుగుల గృహాల్లో దాదాపు 44వేలమందికి రూ.1540కోట్లు వరకు టోకరా వేశాడు. ఆ విధంగా పేదలకు దక్కాల్సిన రూ.4వేలకోట్లను ఫేక్ ముఖ్యమం త్రి కాజేశాడని స్పష్టమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే, ఇచ్చినమాటప్రకారం పేదలకు రూ.4వేలకోట్ల వరకు లబ్ది  చేకూరిఉండేది. జగన్అనే  మోసగాడిని నమ్మబట్టే పేదలు  ఆమొత్తం కోల్పోయారు. 
 
ఇళ్లపట్టాల పంపిణీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. దోషులెవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఇళ్లపట్టాల పంపిణీలో రూ.6,500కోట్లు కాజేయడం ద్వారా 13లక్షలమంది పేదలకు అదనంగా వచ్చే సెంటుభూమిని రాకుండా చేసిన ఘనతకూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.  ఈ విధంగా భూసేకరణ, మెరకతోలడం, టిడ్కోఇళ్ల కేటాయింపులో ముఖ్యమంత్రి ఏవిధంగా పేదలను దగాచేశాడో తేలిపోయింది.

దీనిపై ప్రజలంతా వాస్తవాలు తెలుసుకొని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిలదీయాలని విజ్ఞప్తిచేస్తున్నాను. శ్మశానాల పక్కన ఇళ్లపట్టాలిస్తే, అక్కడే రోడ్లు వేసి, విద్యుత్ స్థంభాలు వేస్తారా? ఇంటి నిర్మాణాల పేరుతో రూ.50వేలకోట్లు ఖర్చుచేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రేపు, మరో స్కామ్ కు పథకరచన చేస్తున్నాడు.

పేదలకు నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లపట్టాలుఇవ్వకపోతే, టీడీపీ తరుపున కాలర్ పట్టుకొని నిలదీస్తాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన ఫేక్ మాటలు కట్టిపెట్టి ప్రజలకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాను.