మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (15:46 IST)

అహోబిలం వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు - 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎగువ అహోబిలం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 
 
సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోపడింది. ఈ బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.