గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:58 IST)

రాజ‌మండ్రి నుంచి పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

దేవాల‌యాల‌యాల‌కు నిల‌యం అయిన రాజమహేంద్రవరంలో కార్తీక మాసం శోభాయ‌మానంగా నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ గోదావ‌రి ఒడ్డున భ‌క్తుల సంచారం రోజు రోజుకూ పెరుగుతోంది. 
 
అందుకే రాజ‌మండ్రి కేంద్రంగా పంచారామ క్షేత్రాలకు తూర్పుగోదావ‌రి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి ప్రత్యేక ప్యాకేజీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్టీసీ అధికారులు తెలిపారు. కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం నవంబరు 7, 14, 21, 28 తేదీల్లో ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్ లగ్జరీ బస్సులను ప్రత్యేక ప్యాకేజీ సర్వీసులుగా నడపనున్నట్లు చెప్పారు. కార్తిక సోమవారాల్లో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట పంచారామ క్షేత్రాలయాలను భక్తులు సందర్శించేలా ఆదివారం రాత్రే ఆయా డిపోల నుంచి బస్సులు బయలుదేరేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 
 
డిపోల వారీగా పెద్దలకు, పిల్లలకు టికెట్‌ ఛార్జీ నిర్ణయించడంతోపాటు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. భ‌క్తుల‌ను ఆయా రోజుల్లో పంచారామాల‌న్నీ తిప్పి, తిరిగి రాజ‌మండ్రికి చేరుస్తామ‌ని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీలో అన్ని క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తున్నామ‌ని, భ‌క్తులు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించాల‌ని కోరారు.