శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (11:11 IST)

గద్వాల బస్సు బోల్తా : 20 ప్రయాణికులు గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఇటిక్యాల మండ‌లం ధ‌ర్మ‌వ‌రం స‌మీపంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు.. జాతీయ ర‌హ‌దారి 44పై బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 20 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు.
 
ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 50 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.