గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:28 IST)

పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించిన ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల విన‌తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించి, ఓట‌ర్ల మెప్పు పొందే ప‌నిలో ఉన్నారు. తాజాగా ఆమె పుత్తూరు నుంచి తిరుపతి వరకు ఆర్టీసీ బ‌స్సు వేయించ‌డ‌మే కాకుండా, దానిని తానే స్వ‌యంగా ప్రారంభించారు. 
 
వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండిగ నుంచి తడుకు వరకు ప్రతి రోజు పాఠశాలల‌కు వెళ్ళే  విద్యార్థినీ విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బ‌స్సు మంజూరు చేయించారు.  పుత్తూరు నుంచి తిరుపతి వరకు (వయా తడుకు, బట్టి కండిగ, కుప్పం బాదూరు ) బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బట్టికండిగ నుంచి తడుకు వరకు విద్యార్థులతో పాటు బస్ లో ఆర్కే రోజా  ప్రయాణించారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగలరెడ్డి, డిపో మేనేజర్ ప్రశాంతి, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాడు నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పాఠశాలకు రావడానికి విద్యార్థులకు సౌకర్యం కల్పించడం త‌మ‌ భాధ్యత అని తెలిపారు.