బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:05 IST)

చైనాలో పడవ బోల్తా: 10 మంది మృతి.. 40మంది ఏమయ్యారు..?

Boat
చైనాలో పడవ బోల్తా పడిన ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నైరుతి చైనా లోని గిజౌప్రావీన్స్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్‌ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్‌లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్‌లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.