శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:52 IST)

మద్యధరా సముద్రంలో బోటు మునక.. 130మంది మృతి

Mediterranean
మద్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా లిబియా తీరంలో ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో యూరప్ కు వెళుతున్న 130 మంది అక్రమ వలస దారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పేదరికం, అంతరయుద్దం భరించలేక ఆఫ్రికా నుంచి చాలా మంది మెరుగైన జీవితం కోసం.. మద్యధరా సముద్రం గుండా యూరప్ లోకి అక్రమంగా చొరబడుతున్నారు. 
 
ఇందుకోసం రబ్బరు బొట్లను ఉపయోగిస్తారు. వీటిలో పరిమితికి మించి వాలసదారులను ఎక్కిస్తారు. అలా 130 మందితో బయలుదేరిన ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 130 మంది మృతి చెందారు. అయితే ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు.