బూడిదైన బస్సు.. తప్పిన ప్రమాదం.. ప్రయాణీకులు నిద్రలో వుండగా..?
ప్రయాణికులు అందరూ నిద్రలో ఉన్న సమయంలో జనగామ ఆర్టీసీ కాలనీ హైవేలో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను కిందికి దింపి వేయడంతో.. అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
జనగామ ఆర్టీసీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ వల్ల ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో TS 04 UD 1089 నెంబర్ గల బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యింది.
సుమారు 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఛత్తీస్‌గఢ్ నుంచి జగదేవపూర్ టు హైదరాబాద్‌కు వెళ్తుండగా లింగాల ఘన్‌పూర్ మండలం నెల్లుట్ల గ్రామం హైవేపై ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఉదయం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని సమాచారం అందిందని.. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందని అన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేపడుతామన్నారు.