శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (10:54 IST)

బస్సుకు బ్రేక్ ఫెయిల్ - లోయలోపడి 28 మంది మృతి

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఓ ఘోరం జరిగింది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన నేపాల్‌లోని ముగు జిల్లాలో జరిగింది. 
 
బ్రేక్‌లు ఫెయిల్ కావ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని సహాయక బృందాలు ర‌క్షించాయి. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు. 
 
నేపాల్‌లో పండుగ సీజ‌న్ మొదలైంది. దీంతో అనేక మంది పండుగ వేడుక‌ల్లో పాల్గొనేందుకు ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన డ‌జ‌ను మందికి చికిత్స‌ను అందించారు. ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులో ఎంత మంది ప్ర‌యాణికులు ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశంవుంది.