శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

‘సైరా’ తెచ్చిన తంటా.. ఆరుగురు ఎస్సైలు వీఆర్‌కు బదిలీ

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని తొలిరోజే చూడాలనుకున్న ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ కోవకే చెందిన ఆరుగురు ఎస్సైలు బెన్‌ఫిట్ షోకు వెళ్లడంతో వారిపై ఎస్పీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

అయితే వీరు విధి నిర్వహణలో ఉండగా సినిమాకు వెళ్లడమే చేసిన తప్పిదం. ఇదే ఎస్పీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కోవెలకుంట్లలో సైరా నరసింహారెడ్డి బెన్‌ఫిట్ షోకు ఆరుగురు ఎస్సైలు వెళ్లారు. ఎస్సైల తీరుపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్ అయ్యారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో వీఆర్‌కు పంపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హరిప్రసాద, వెంకటసుబ్బయ్య, ప్రియతంరెడ్డి, అశోక్ గా తేలింది.