గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (10:29 IST)

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

సంక్రాంతికి మ‌ల్లికార్జునుడు ముస్తాబ‌య్యాడు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభంగా నిర్వ‌హించేందుకు రుత్వికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం  శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జ‌న‌వ‌రి 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
 
 
బుధ‌వారం ఉదయం 9:15 గంటలకు యాగశాల ప్రవేశం జరుగనుండగా, సాయంత్రం 5:30 గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు మ‌ల్లికార్జున స్వామికి, అమ్మవార్లకు విశేషపూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నుండి 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, స్వామి అమ్మవార్ల కల్యాణం ఏకాంతసేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. 
 
 
భ‌క్తులంతా భౌతిక దూరం పాటిస్తూ, క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం ద‌ర్శ‌నం చేసుకునేలే ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. అయితే, చాలా మంది భ‌క్తులు ఒమిక్రాన్ విస్త‌ర‌ణ భ‌యంతో మునుప‌టిలా ద‌ర్శ‌నాల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితులున్నాయి.