సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (22:04 IST)

శ్రీశైలంలో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం

శ్రీశైలంలో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం ప్రారంభం‌ కానున్నాయని ఈఓ లవన్న తెలిపారు. కార్తీకమాసంలో స్వామివారి  గర్భాలయ స్పర్శ దర్శనం పూర్తిగా రద్దు చేశామన్నారు.

ఆలయంలో సామూహిక అభిషేకాలు విడతల వారీగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. విఐపి బ్రేక్ దర్శనం కార్తీకమాసంలో కొనసాగుతుందన్నారు. అంతరాలయంలో లింగ దర్శనం రద్దు చేశామని తెలిపారు. లలితాంబిక వానిద్య సముదాయం షాపులపై  కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు దేవస్థానం సిద్దంగా ఉందన్నారు.

షాపింగ్ కాంప్లెక్స్ విషయమై కొందరు వ్యక్తులు డబ్బులు వసులు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది అటువంటి విషయంలో దేవస్థానానికి సంబంధం లేదని చెప్పారు. దేవస్థానానికి వ్యతిరేకంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.