సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-10-2021 ఆదివారం దినఫలాలు .. సూర్య నారాయణ పారాయణ చేసినా...

మేషం :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఖర్చులు సామాన్యం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
వృషభం :- రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. గృహములో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు.
 
మిథునం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్ధులకు వసతి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
 
కర్కాటకం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సొంత నిర్ణయం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. మిత్రులను కలుసుకుంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు లాభదాయకం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పొట్ట, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి.
 
సింహం :- కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు. విందులలో పరిమితి పాటించండి. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి.
 
కన్య :- ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సివస్తుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. తల పెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తలెత్తుతాయి. సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబీకుల కోసం ధనం బాగావ్యయం చేస్తారు.
 
తుల :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసలుబాటు ఉంటుంది. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలుకొనుట మంచిది. ప్రయాణాల్లో పాత మిత్రులు, అయిన వారు తారసపడతారు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
వృశ్చికం :- తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
ధనస్సు :- రాజకీయనాయకులకు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి కొద్దిపాటి చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు.
 
మకరం :- వ్యాపారాల్లో నష్టాలను నిదానంగా పూడ్చుకోగల్గుతారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తి చేసుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
కుంభం :- రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. పెద్దలతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల ఆకస్మిక రాక ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- మీ పాత సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో చికాకులు అధికం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.