మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-10-2021 శుక్రవారం దినఫలాలు .. లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..

మేషం :- ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల విషయంలో ముందు చూపు ఎంతో అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పత్రికా సంస్థలో వారికి పనిభారం అధికమవుతుంది.
 
వృషభం :- రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మిథునం :- బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనువుతారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. 
 
కర్కాటకం :- వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. పత్రికా సంస్థలో వారికి పనిభారం అధికమవుతుంది. తొందరపాటు నిర్ణయాలవల్ల అనర్థాలు తప్పవు. క్రీడా రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. 
 
సింహం :- ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనువుతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి సదావకాశాలు లభిస్తాయి. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కన్య :- మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల :- ఆర్థిక వ్యవహారాల్లో ఆచి, తూచి వ్యవహరిస్తారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి బంధువుల గురించి ప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. 
 
వృశ్చికం :- బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ఇసుక, క్వారీ, బిల్డింగ్ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో చుకుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుతాయి. ప్రముఖల కలయిక వాయిదా పడుతుంది.
 
మకరం :- ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి.
 
కుంభం :- ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవటం ఉత్తమం. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. ఉద్యోగస్తులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది.
 
మీనం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకస్మికంగా బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు.