శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

25-10-2021 సోమవారం దినఫలాలు .. మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

మేషం :- ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి.
 
వృషభం :- శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో డాక్టర్లు పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు.
 
మిథునం :- ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి కానవస్తుంది. స్త్రీల ధ్యేయం నెవవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువలు అవసరం. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
కర్కాటకం :- బంధువులకు హామీ ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. రిప్రజెంటేటిన్లు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. ఉద్యోగస్తుల పనితీరు అధికారులను సంతృప్తి పరుస్తుంది. ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
తుల :- తరుచూ దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు ఊహించి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. రాబడి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
ధనస్సు :- ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. మీ సమర్థత పై అధికారులకు నమ్మకం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది.
 
మకరం :- వృత్తుల వారికి కలిసిరాగలదు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీధ్యేయం నెరవేరుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లో ఎకాగ్రత, మెళుకువ అవసరం. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. విదేశాయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.
 
మీనం :- మార్కెటింగ్ రంగాల వారికి పెద్ద సంస్థల నుండి అవకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.