బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 మే 2020 (17:33 IST)

పారిశుద్ధ్య కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలి: సిఐటియు

రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు  ఎం రవి ఎం భాగ్య రాజులు  డిమాండ్ చేశారు.
 
 రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 8,600 రూపాయలు జీతం ఇస్తూ వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న ఎస్ కే వలీ ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగు నెలల నుండి వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
 
జీతాలు లేకుండా లాక్ డౌన్ సమయంలో కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు  నాలుగు నెలల నుండి జీతాలు లేక అప్పు ఇచ్చే వాళ్ళు లేక కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు.
 
మరో ప్రక్క పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండా వారితో పనులు చేయించడం ఏమిటని పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు అంటే అంత అలుసా ఈ పాలకులకు అని ప్రశ్నించారు.
 
 నాలుగు నెలల నుండి  జీతాలు రాక అడిగి అడిగి విసిగివేసారిన పారిశుద్ధ్య కార్మికులు గురువారం నాడు రాజధాని గ్రామాలలో విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారని దీనికి సి ఆర్ డి ఎ  ఎస్.కె ఏజెన్సీ ఏ బాధ్యత వహించాలని అన్నారు.
 
తక్షణం పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు రక్షణ పరికరాలు ఇవ్వాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. నవులూరు లో జీతాలు ఇవ్వాలని కోరుతూ సమ్మెకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు కార్మికులకు మద్దతు తెలుపుతున్న సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు రవి, టిడిపి నాయకులు మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
 
రాజధాని గ్రామమైన ఎర్రబాలెం లో పెండింగ్ ఉన్న నాలుగు నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియచేశారు.