గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (18:53 IST)

ఆటో డ్రైవర్ డోర్ తీశాడు.. బైకుపై వెళ్లిన ఇద్దరు లారీ కింద పడిపోయారు.. చివరికి?

సంగారెడ్డి జిల్లా ఐడీఎల్ బొల్లారం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షేర్ ఆటో చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం రికార్డు అయ్యింది. షేర్ ఆటో డ్రైవర్ వున్నట్టుండి డోర్ తెరిచాడు. దీంతో పక్కన వుస్తున్న బైకుకు తగిలింది. అంతే ఆ బైకు అదుపు తప్పింది. 
 
పక్కనే వెళ్తున్న లారీ కింద బైకులో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు పడిపోయారు. అంతే లారీ టైర్లకు బలైపోయారు. ఈ ఘటనను కళ్లారా చూసిన షేర్ ఆటో డ్రైవర్ ఏమీ తెలియనట్లు నడిచి వెళ్లాడు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని సైది రెడ్డి, లక్ష్మిగా గుర్తించారు.
 
వీరు చేర్యాల గ్రామస్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అజాగ్రత్తగా డోర్ తీయడంతో బైకును డోర్‌ను తాకి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.