శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:49 IST)

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అడ్మిషన్ల షెడ్యూల్ విడుద‌ల

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తుర్భా గాంధీ  బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీలు) 2020 -21 విద్యా సంవత్సరానికిగాను, 6వ తరగతిలో ప్రవేశం, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు  స్వీకరించ‌డం ఆగస్టు 25తో ముగిసింది.

ఎంపిక చేయబడిన విద్యార్ధినులు ఆగస్టు 31నుండి సెప్టెంబరు 4వరకు, వారి మొబైల్ నెంబర్‌కు పంపబడిన సమాచారం ప్రకారం సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాల‌ని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు.

మొబైల్ ఫోన్  ద్వారా సమాచారం అందించబడిన విద్యార్థినులు తమతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం వివరాల‌ను తీసుకురావాల్సి ఉంటుంద‌న్నారు.

ఎంపిక చేయబడిన విద్యార్థినుల వివరాల‌ను వెబ్‌సైట్ నందు మరియు  పాఠశాల నోటీసు బోర్డు నందు ప్రదర్శించబడతాయ‌ని పేర్కొన్నారు. ఇత‌ర వివ‌రాల‌కు 9441270099, 9494383617నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు.