శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (09:53 IST)

నాగార్జున యూనివర్సిటీ పరీక్షల షెడ్యూలు ఖరారు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఎఎన్‌యు) పరిధిలో పిజి, వృత్తి విద్యాకోర్సుల పరీక్షల షెడ్యూలు ఖరారైంది. ఈ వివరాలను పరీక్షల నిర్వహణాధికారి సిహెచ్‌ ఉషారాణి విడుదల చేశారు.

పిజి ఆర్ట్స్‌, కామర్స్‌, లా, ఎంబిఎ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జూలై 8 నుంచి, పిజి సైన్స్‌ ఎంసిఎ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు 20 నుంచి, పిజి ఆర్ట్స్‌, సైన్స్‌ ఎంబిఎ, ఎంసిఎ ద్వితీయ సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్నాయి.

బిటెక్‌, బిఫార్మసీ, ఫార్మా-డి, ఎల్‌ఎల్‌బి పరీక్షల షెడ్యూలును కూడా ప్రకటించినట్లు తెలిపారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌ నుండి పొందవచ్చని ఉషారాణి తెలిపారు.