శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:29 IST)

లోకేశ్ కు భద్రత కుదింపు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు భద్రతను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ కేటగిరీ కింద లోకేశ్ కు 2 ప్లస్ 2 భద్రత ఉండేది.

అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఆ భద్రత 1 ప్లస్ 1కు తగ్గిపోనుంది. టీడీపీ హయాంలో లోకేశ్ భద్రత 4 ప్లస్ 4గా ఉండేది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఓ ఎమ్మెల్యేను మావోలు చంపేయడంతో లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు.

దాంతో అదనపు భద్రత ఏర్పాట్లు కల్పించారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు రావడంతో లోకేశ్ భద్రతను 2 ప్లస్ 2కి కుదించారు. ఇప్పుడది కూడా తగ్గించారు.