బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (10:46 IST)

వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి: ఇడుపులపాయలో ఘన నివాళులు

YSR Ghat
YSR Ghat
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాలను షర్మిల తన తనయుడు రాజారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు.
 
ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుండి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. 
 
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వీరు వైఎస్ సమాధి వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.