శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:23 IST)

ఛలో సెక్రటేరియట్.. ఆంధ్రరత్న భవన్‌లో బస చేసిన వైఎస్ షర్మిల

ys sharmila
వైసీపీ ప్రభుత్వం ఏపీలో కాంగ్రెస్ నేతలను గృహనిర్భంధం చేసిన నేపథ్యంలో... అరెస్టును నివారించేందుకు షర్మిల ఆంధ్రరత్న భవన్‌లో బస చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఫిబ్రవరి 22న జరుగనుంది. 
 
ఏపీ పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. అంతేగాకుండా.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధాలను ప్రారంభించారు. కేవీపీ రామచంద్రరావు ఇంటికి వెళ్లాల్సిన షర్మిల.. హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ మార్చారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లిన ఆమె బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. అయితే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు.