బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (14:06 IST)

మళ్లీ సొంతగూటికి చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి... మంగళగిరి నుంచి పోటీ!!

allaramakrishnareddy
మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంతగూటికి చేరారు. ఆయనతో వైకాపా సీనియర్ నేత విజయసాయి రెడ్డి సోమవారం రాత్రి సుధీర్ఘంగా జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఆయన మంగళవారం మళ్లీ వైకాపా అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆర్కే తిరిగి సొంత పార్టీలో చేరారు.
 
కాగా, గత డిసెంబరు నెలలో ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఆనయ రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి ఆర్కేతో విజయసాయిరెడ్డి సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఆర్కేను మళ్లీ వైకాపాలో చేరేందుకు ఒప్పించారు. దీంతో ఆయన తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ఆర్కేకు మళ్ళీ మంగళగిరి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.