శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (09:11 IST)

సినిమాల్లో అవకాశం ఇస్తానని మోసం.. యువతులు దుస్తుల మార్చడాన్ని వీడియో తీశాడు..

షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మోసానికి పాల్పడే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పలువురు యువతులతో పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశం ఇస్తానంట

షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మోసానికి పాల్పడే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పలువురు యువతులతో పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ నమ్మించి.. వారిని ఫోటో సెషన్ కోసం పిలిపించాడు. ఆపై ఆ యువతులు గదిలో దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీసి వారిని వివిధ రకాలుగా బెదిరించేవాడు.
 
నిఖిల్‌ మాటలకు మోసపోయిన ఓ యువతి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు తాము కూడా నిఖిల్‌ చేతిలో మోసపోయామంటూ పోలీసులకు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలేనికి చెందిన వైడా నిఖిల్‌ (24) నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫైనలియర్‌ చదువుతున్నాడు. అతడు షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుంటాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఫోటో సెషన్ కోసం రమ్మని.. యువతులు దుస్తులు మార్చడాన్ని వీడియో తీసేవాడు. ఈ బండారం కాస్త యువతుల ఫిర్యాదుతో బయటపడటంతో నిఖిల్ అరెస్టయ్యాడు.