మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 23 నవంబరు 2017 (15:55 IST)

25న జనసేనలోకి శివబాలాజీ - పార్టీ ముఖ్య బాధ్యతలు..

బిగ్ బాస్ షో తరువాత హీరో శివబాలాజీ రేంజ్ మారిపోయింది. సినిమాల్లో అవకాశాలతో పాటు రాజకీయాల్లోకి వెళుతున్నారు శివబాలాజీ. పవన్ కళ్యాణ్ అంటే ముందు నుంచీ ఎంతగానో అభిమానించే శివబాలాజీకి ఆయన స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఒక నిర్ణయానికి వ

బిగ్ బాస్ షో తరువాత హీరో శివబాలాజీ రేంజ్ మారిపోయింది. సినిమాల్లో అవకాశాలతో పాటు రాజకీయాల్లోకి వెళుతున్నారు శివబాలాజీ. పవన్ కళ్యాణ్ అంటే ముందు నుంచీ ఎంతగానో అభిమానించే శివబాలాజీకి ఆయన స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే పార్టీ పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు.. అందులోను పవన్ కళ్యాణ్‌ చురుగ్గా పార్టీ వ్యవహారాలు చూడటంలేదు కాబట్టి ఆలస్యంగా వెళ్ళాలని శివబాలాజీ నిర్ణయానికి వచ్చేశారు. 
 
కానీ ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో పాటు పార్టీ పటిష్టతకు పవన్ కళ్యాణ్‌ వేగంగా ముందుకు వెళుతుండటంతో శివబాలాజీ తన ఆలోచనను మార్చుకున్నారు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. 25వ తేదీన పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు శివబాలాజీ. పార్టీకి సంబంధించిన ముఖ్య బాధ్యతలను కూడా పవన్ కళ్యాణ్‌ బాలాజీకి అప్పగించనున్నట్లు సమాచారం.