గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (09:05 IST)

విషనాగును కాపాడాడు.. కానీ కాటేసింది..

విషనాగులతో స్నేహం ఎన్నటికీ ప్రమాదమని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ఘటనే విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలో గురువారం జరిగింది. పాముకు హాని తలపెట్టకూడదన్న దయాగుణం చివరకు అతని ప్రాణాలనే హరించింది. షాపులోకి దూరిన పాముని చంపకుండా పట్టుకుని  ఊరి అవతల వదిలేందుకు ప్రయత్నించిన అప్పయ్య (46) అదే పాము కాటుకు ప్రాణాలు కోల్పోయాడు.
 
వివరాల్లోకి వెళితే.. చిన్నవీధి బజారు సెంటరులోని కూరగాయల దుకాణంలోకి వచ్చిన తాచుపామును చంపేందుకు యజమాని ప్రయత్నించాడు. అప్పుడే అక్కడికొచ్చిన అప్పయ్య పామును చంపకుండా అడ్డుకున్నాడు. దాన్ని పట్టుకొని ఊరి పొలిమేరల్లో విడిచిపెట్టేందుకు తీసుకెళ్తుండగా అప్పయ్య చేతికి పాము కాటేసింది. ఈ నేపథ్యంలో అప్పయ్యను ఆస్పత్రికి తరలించారు. అయినా అప్పయ్య చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు.