శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (22:36 IST)

మంగళగిరిలో జనసేనాని... పశు సంరక్షణ

పాడి, పంట మన సంస్కృతిలో భాగం. ప్రకృతిని ప్రేమించే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి వ్యవసాయమన్నా, పశు పోషణ అన్నా అమితమైన ఇష్టం. రైతు జీవితం... పాడిపంట కలనేత అని చెబుతారు జనసేనాని. వీలు చిక్కినప్పుడల్లా స్వయంగా అటు వ్యవసాయం చేస్తారు. ఇటు గోవులకు సేవ చేస్తూ ఉంటారు. 
 
అందుకే పార్టీ మూల సిద్ధాంతాలలో ‘సంస్కృతుల్ని కాపాడే సమాజం’ అంటూ వాటికి పెద్ద పీట వేశారు. విషయానికి వస్తే మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారు. ఈ రోజు (గురువారం) సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యాలయానికి చేరుకోగానే గోమాతలకు మేత వేసి వాటి ఆలనాపాలన గురించి వాకబు చేశారు.