శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 3 మార్చి 2019 (15:07 IST)

జనసేన కార్యకర్తలంతా పిచ్చోళ్లు.. రేణూ దేశాయ్

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ జనసైనికులపై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ కార్యకర్తలంతా పిచ్చోళ్ళుగా ఆమె అభివర్ణించారు. పైగా, వారి మాటలు అసలు ఏమాత్రం పట్టించుకోనక్కర్లేదని ఆమె పిలుపునిచ్చారు. 
 
ఆమె ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించి స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ఆమె ప్రముఖ టీవీ చానెల్ యాంకర్‌గా మారారు. అదే రోజు పవన్ కళ్యాణ్ కూడా పర్యటించారు. దీంతో పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీనే రేణూదేశాయ్‌ని ఉసిగొల్పుతోందంటూ జనసేన కార్యకర్తలు ఆమెపై విరుచుకు పడ్డారు. 
 
ఈ విమర్శలకు రేణూ దేశాయ్ ఘాటుగా స్పందించారు. 'నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారి మానసిక స్థితిపై నాకు అనుమానాలు ఉన్నాయి' అని అన్నారు. ఇన్నాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇకపై అటువంటి వారిని ఉపేక్షించేది లేదు. నాకు ఏ పార్టీలో చేరే అవసరం లేదన్నారు. 
 
పైగా, 'నేను రైతు సమస్యలపై ఓ డాక్యుమెంటరీ షూట్‌ చేస్తున్నాను. అందుకోసమే ఆ రోజు ఓ టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తాను. అంతకు మించి ఏమీ లేదు. కానీ జనసేన సైనికులు ఏదో ఊహించుకుని నోటికొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పిచ్చోళ్లులాగా ప్రవర్తిస్తున్నారు' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.